News March 29, 2025

ఒంగోలు: ‘విద్యుత్ సర్ ఛార్జీలను రద్దు చేయాలి’

image

ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే. మాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలపై భారాలు మోపడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Similar News

News January 13, 2026

త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

image

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 13, 2026

మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్‌పోర్ట్

image

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పో‌ర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పో‌ర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.

News January 13, 2026

విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్