News March 29, 2025

ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగ‌వంతం చేయాలి: మంత్రి పొంగులేటి

image

పైల‌ట్ గ్రామాల‌్లో ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణమే చెల్లింపులు జ‌ర‌పాల‌ని ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నులు, సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

Similar News

News November 4, 2025

దుర్గగుడి చైర్మన్ ఫ్రస్ట్రేషన్..!

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దుర్గగుడి ఉద్యోగులపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తనకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని, ప్రోటోకాల్ పాటించట్లేదని, గౌరవం ఇవ్వట్లేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తన అభిమాన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు లేఖ కూడా రాసినట్లు ఆయన చెబుతున్నారట. దీంతో దుర్గ గుడిలో చైర్మన్ Vs ఉద్యోగుల మధ్య వార్ నడుస్తోందనే చర్చ జోరుగా జరుగుతోంది.

News November 4, 2025

ప్రకాశం: మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు.. దరఖాస్తుల ఆహ్వానం!

image

జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో 4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, వై పాలెం, గిద్దలూరు, కంభం స్టేషన్ల పరిధిలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా పదో తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. 12న ఒంగోలులో లాటరీ తీస్తామన్నారు.

News November 4, 2025

బీకే సముద్రంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

image

బుక్కరాయసముద్రంలోని విజయనగర్ కాలనీలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. స్థానిక పరిస్థితులను చూసిన ఆమె పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో సీసీ రోడ్లు, కాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.