News March 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 5, 2025

వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

image

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ(డెమోక్రాట్) విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. హష్మీ 1964లో HYDలో జన్మించారు. మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్లి స్థిరపడ్డారు. బీఏ ఆనర్స్, సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో రిచ్‌మండ్‌కు వెళ్లిన ఆమె 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

News November 5, 2025

వరి మాగాణుల్లో నువ్వులు, ఆవాలు ఎప్పుడు చల్లుకోవాలి?

image

రాయలసీమ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో వరి కోసే 10 రోజులకు ముందు ఆవాలు, నువ్వుల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. ఆవాలు ఎకరాకు 1 నుంచి 1.5కిలోలు, నువ్వులు ఎకరాకు 1.5 నుంచి 2 కిలోలు అవసరం. ఆవాల విత్తనాలను 5-6 కిలోల సన్నని ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా వెదజల్లాలి. ఆ సమయంలో బురద పదునులో విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. నువ్వుల విత్తనాలను 1.5kg బియ్యపు నూకలతో కలిపిచల్లితే సమానంగా పొలంలో పడతాయి.

News November 5, 2025

కాసేపట్లో వర్షం..

image

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.