News March 29, 2025
గాంధారి: వడ్డీ వ్యాపారులపై కేసు

గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
Similar News
News April 4, 2025
తూప్రాన్: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అవార్డు

తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
News April 4, 2025
IPL: మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు

SRH తరఫున బరిలోకి దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ నిష్నిని వివాహమాడారు. అంతకుముందే హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ కోసం దాన్ని క్యాన్సిల్ చేసుకుని కోల్‌కతా వచ్చేశారు. ఒకే ఓవర్ వేసిన అతడు ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నారు. 29 రన్స్ చేసి పర్వాలేదనిపించారు. వేలంలో అతడిని SRH రూ.75 లక్షలకు దక్కించుకుంది.
News April 4, 2025
అచ్చంపేట: ఈయన చనిపోయాడు.. గుర్తుపడితే చెప్పండి..!

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ గుర్తుతెలియన వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా ప్రయాణికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే అచ్చంపేట పోలీసుల నంబర్ 8712657733కు ఫోన్ చేయాలని సబ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.