News March 29, 2025
పంచాయతీలకు పండుగ..త్వరలో రహదారుల నిర్మాణం

AP: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1202కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను నాబార్డు నిధులు రూ.557 కోట్లను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా మెుత్తం 402 రహదారులు వేయనున్నారు. ఈ రోడ్లను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను DY.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Similar News
News November 12, 2025
SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

<
News November 12, 2025
జల సంరక్షణలో తెలంగాణ నంబర్-1

జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ(ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ) విభాగంలో TG ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 5,20,362 పనులు పూర్తిచేసి ఈ ఘనత సాధించింది. జిల్లాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల టాప్లో నిలిచాయి. ఇదే కేటగిరీ మున్సిపల్ విభాగంలో రాజమండ్రి(AP) 4వ ర్యాంకు సాధించింది. దీంతో ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల నగదు బహుమతి రానుంది. ఈ నెల 18న రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేస్తారు.
News November 12, 2025
సీరం వాడుతున్నారా?

చర్మ సంరక్షణలో సీరం కీలకపాత్ర పోషిస్తుంది. మీకున్న చర్మ సమస్యకు తగిన సీరం ఎంచుకోవడం ముఖ్యం. విటమిన్ సి సీరం వృద్ధాప్య ఛాయల్ని, హ్యాలురోనిక్ యాసిడ్ ఉన్న సీరం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖంపై ముడతలు ఉంటే రెటినాల్ సీరం, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి బీటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్ష గింజల సారం ఉన్న సీరం మంచిది. సున్నిత చర్మం ఉంటే యాంటీఇన్ఫ్లమేటరీ సీరం ఎంచుకోవాలి.


