News March 29, 2025
NZB: అక్రమంగా విక్రయిస్తున్న రెండు గంజాయి పట్టివేత

అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.
Similar News
News July 10, 2025
NZB: ఫోక్ డాన్సర్ జానూ లిరి సందడి

ఫోక్ డాన్సర్ జానూలిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని సూచించారు.
News July 9, 2025
NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
News July 9, 2025
NZB: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం.. ASI భార్య మృతి

NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.