News March 29, 2025
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు..

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 12,566, కనిష్ఠ ధర రూ. 9,211, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11,888, కనిష్ఠ ధర రూ. 9,051, పసుపు చూర గరిష్ఠ ధర రూ. 9,452, కనిష్ఠ ధర రూ. 8,183లుగా పలికాయి. కాగా ఈ సీజన్లో మొత్తం కొనుగోళ్ళు 36,557 క్వింటాళ్లు కాగా, ఈ రోజు 325 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయి.
Similar News
News April 2, 2025
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

IPL ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 18M ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ టీమ్‌గా నిలిచింది. ఇప్పటికే ఫాలోయింగ్‌లో CSK(17.8M)ను దాటేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 18వ సీజన్, విరాట్ జెర్సీ నం.18 కావడం, IG ఫాలోవర్లు 18Mకు చేరడం చూస్తుంటే కప్ తమదేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో RCB టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.
News April 2, 2025
బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News April 2, 2025
అనకాపల్లి జిల్లాలో 94.87 పెన్షన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంగళవారం 94.87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,072 మందికి పెన్షన్ పంపిణీకి రూ.108 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 2,43,580 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉందన్నారు.