News March 29, 2025
నంద్యాల: ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఉగాది సందర్భంగా నంద్యాల మీదుగా రెండు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-హుబ్లీ మధ్య ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 31న రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి హుబ్లీకి బయలుదేరే రైలు(07271) నంద్యాలకు రాత్రి 12:50 గంటలకు చేరనుంది. అలాగే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు హుబ్లీ నుంచి గుంటూరుకు బయలుదేరే రైలు(07272) నంద్యాలకు రాత్రి 7:50 గంటలకు చేరనుంది.
Similar News
News April 2, 2025
HCUకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పిలుపు

HCU విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడాన్ని BJYM నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా BJYM ఆందోళనకు పిలుపునిచ్చింది. సీఎంకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నామని రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
News April 2, 2025
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లోని క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల థాయిలాండ్, అఫ్గానిస్థాన్, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
News April 2, 2025
రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి: కిషన్ రెడ్డి

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని మీరు హామీ ఇచ్చి ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై ఎలా నెడుతారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోతే, ఎలా హామీ ఇచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకే రేవంత్ ఈ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలను వాడుకొని వదిలేయాలన్న ఆలోచనే ఉందని మండిపడ్డారు.