News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Similar News
News April 2, 2025
పెద్దేముల్‌లో మహిళ మృతదేహం లభ్యం

పెద్దేముల్ మండల కేంద్రంలోని పెద్ద కెనాల్ వద్ద బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ ఒంటిపై, ముఖంపై కాల్చిన గాయాలు కనిపిస్తున్నాయి. కాగా, దుండగులు హత్య చేసి నీటి కాలువలో పడేసినట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరి మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో చికిత్స పొందతూ ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గగ్గలపల్లికి చెందిన బాలమ్మ(60) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపం చెంది ఈనెల 25న పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది. అదే గగ్గలపల్లికి చెందిన మల్లమ్మ(45) కూతురి పెళ్లికావటంతో ఒంటరిగా ఫీలై అనారోగ్యంబారిన పడింది. మనస్తాపం చెంది ఈనెల 26న పురుగుమందు తాగగా, చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది.
News April 2, 2025
రేకులపల్లిలో వ్యక్తి మృతి

గద్వాల మండలంలో ఓ వ్యక్తి చికిత్సపొందుతూ నిన్న మృతిచెందారు. పోలీసుల వివరాలు.. రేకులపల్లికి చెందిన నారాయణ(35) నాలుగురోజుల క్రితం కృష్ణా నదిలో పట్టిన చేపలు విక్రయించేందుకు బైక్‌పై గద్వాలకు వస్తుండగ.. అదుపు తప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు.