News March 29, 2025

HYD: జీహెచ్ఎంసీ కొత్త యాప్.. ఆన్ లైన్ చలాన్ !

image

హైదరాబాద్ నగర పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ త్వరలో కొత్త యాప్‌ను ప్రారంభించనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ రూపొందించిన ఈ యాప్ ద్వారా చెత్త నిర్వాహణ మరింత సమర్థంగా మారనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేయడాన్ని నివారించేందుకు ఈ-చలాన్లు జారీ చేస్తారు. చలాన్ల చెల్లింపులు యూపీఐ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీంతో లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి.

Similar News

News April 2, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో చికిత్స పొందతూ ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గగ్గలపల్లికి చెందిన బాలమ్మ(60) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపం చెంది ఈనెల 25న పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది. అదే గగ్గలపల్లికి చెందిన మల్లమ్మ(45) కూతురి పెళ్లికావటంతో ఒంటరిగా ఫీలై అనారోగ్యంబారిన పడింది. మనస్తాపం చెంది ఈనెల 26న పురుగుమందు తాగగా, చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది.

News April 2, 2025

రేకులపల్లిలో వ్యక్తి మృతి

image

గద్వాల మండలంలో ఓ వ్యక్తి చికిత్సపొందుతూ నిన్న మృతిచెందారు. పోలీసుల వివరాలు.. రేకులపల్లికి చెందిన నారాయణ(35) నాలుగురోజుల క్రితం కృష్ణా నదిలో పట్టిన చేపలు విక్రయించేందుకు బైక్‌పై గద్వాలకు వస్తుండగ.. అదుపు తప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు.

News April 2, 2025

బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!