News March 29, 2025
MDCL: స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుక

కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుకగా, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి ఒక్క రూపాయి వడ్డీని తిరిగి చెల్లించే నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను సంబంధిత బ్యాంకుల ఖాతాల్లో జమ చేయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.5.66 కోట్లు చెల్లించి, జిల్లాలోని 3910 స్వయం సహాయక సంఘాలకు గత సంవత్సరం చెల్లించిన వన్ రూపీ వడ్డీ తిరిగి చెల్లించడం జరిగిందని అధికారులు తెలిపారు.
Similar News
News April 2, 2025
SC కార్పొరేషన్ రుణాలు.. 11 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

AP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగనుంది. మెడికల్ షాపులు, ల్యాబ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ ఆటో, కార్లు, గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
News April 2, 2025
పెదగంట్యాడలో అమ్మాయి ఆత్మహత్య

పెదగంట్యాడ మండలానికి చెందిన 21 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. విశాఖలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతున్న పైలా దివ్య పెదగంట్యడలోని నేతాజీ నగర్‌లో ఉంటోంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మంగళవారం తెలిపారు.
News April 2, 2025
పెద్దేముల్‌లో మహిళ మృతదేహం లభ్యం

పెద్దేముల్ మండల కేంద్రంలోని పెద్ద కెనాల్ వద్ద బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ ఒంటిపై, ముఖంపై కాల్చిన గాయాలు కనిపిస్తున్నాయి. కాగా, దుండగులు హత్య చేసి నీటి కాలువలో పడేసినట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.