News March 29, 2025

భారత్‌లో WWE లైవ్ ఈవెంట్స్: ప్రెసిడెంట్

image

భారత్‌లో WWE లైవ్ ఈవెంట్స్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ఆ కంపెనీ ప్రెసిడెంట్ నిక్ ఖాన్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా WWE ఎపిసోడ్స్ లైవ్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ ‘ఇండియాలో క్రికెట్ తర్వాత పాపులర్ స్పోర్ట్ WWE. అందుకే మాకు ఈ దేశ ప్రేక్షకులు ముఖ్యం. చాలా మంది ఒంటరిగా, ఫ్యామిలీతో కలిసి మా షోను చూస్తుంటారు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

విదేశీ యువతిపై రేప్.. సంచలన విషయాలు?

image

HYDలో అత్యాచారానికి గురైన జర్మనీ యువతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నగర శివార్లలో అందమైన లొకేషన్లు ఉంటాయంటూ ఆ యువతిని నమ్మించి పాతబస్తీకి చెందిన మహ్మద్ అస్లాం (25) పహాడీ షరీఫ్ తీసుకెళ్లాడు. ఆమెతో వచ్చిన ఫ్రెండ్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ యువతిపై దారుణం జరుగుతున్నా అతడు స్పందించలేదని సమాచారం. ఆ యువతి జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News April 2, 2025

రిజర్వేషన్ల పెంపుపై నేడు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా

image

TG: బీసీల రిజర్వేషన్లు 42% పెంపుపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, MLAలు మహాధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపగా పార్లమెంటులోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, AICC నేతలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొననున్నారు.

News April 2, 2025

గాంధీ ముని మనవరాలు కన్నుమూత

image

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.

error: Content is protected !!