News March 29, 2025
మయన్మార్‌కు భారత్ సాయం

భారీ <<15913182>>భూకంపంతో<<>> అతలాకుతలం అయిన మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరకులు ఉండనున్నాయి. హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి IAF C-130J ఎయిర్‌క్రాఫ్ట్‌లో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News April 2, 2025
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్స్

నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.
News April 2, 2025
విదేశీ యువతిపై రేప్.. సంచలన విషయాలు?

HYDలో అత్యాచారానికి గురైన జర్మనీ యువతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నగర శివార్లలో అందమైన లొకేషన్లు ఉంటాయంటూ ఆ యువతిని నమ్మించి పాతబస్తీకి చెందిన మహ్మద్ అస్లాం (25) పహాడీ షరీఫ్ తీసుకెళ్లాడు. ఆమెతో వచ్చిన ఫ్రెండ్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ యువతిపై దారుణం జరుగుతున్నా అతడు స్పందించలేదని సమాచారం. ఆ యువతి జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
News April 2, 2025
రిజర్వేషన్ల పెంపుపై నేడు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా

TG: బీసీల రిజర్వేషన్లు 42% పెంపుపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, MLAలు మహాధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపగా పార్లమెంటులోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, AICC నేతలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొననున్నారు.