News March 29, 2025
NTRకు బ్రహ్మరథం పట్టిన బాపట్ల జిల్లా

సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున(1982 మార్చి 29న) NTR టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. రేపల్లెలో ఎడ్ల వెంకట్రావు, వేమూరులో నాదెండ్ల భాస్కరరావు, బాపట్లలో సీవీ రామరాజు, చీరాలలో చిమట సాంబు, పర్చూరులో దగ్గుబాటి చౌదరి, అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య టీడీపీ MLAలుగా గెలిచారు.
Similar News
News April 2, 2025
కొండగట్టు : అంజన్న సన్నిధిలో దీక్షలు స్వీకరణ

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు పలు జిల్లాలకు చెందిన భక్తులు హనుమాన్ మాల స్వీకరించారు . స్థానిక ఆలయ అర్చకులు పవన్, అనిల్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో 11 రోజులు పాటు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు మాల వేసుకున్న స్వాములు చిన్న జయంతికి విరమణ చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకున్నారు .
News April 2, 2025
ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.
News April 2, 2025
వనపర్తి: ఇది పెద్దగూడెం రామాలయం చరిత్ర…!

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయాన్ని 1791లో నాటి వనపర్తి సంస్థానాధీశులు రాణి శంకరమ్మ తన భర్త రామేశ్వరరావు జ్ఞాపకార్థంగా నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. మూల విరాట్ విగ్రహాలను తమిళనాడు మఠాధిపతులు ప్రతిష్ఠించారని పెద్దగూడెం కోదండ రామాలయం ప్రధాన అర్చకులు రమణయ్య తెలిపారు.