News March 29, 2025
కాకినాడ: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది.అయితే ఆ రోజు రంజాన్ సెలవు కావడంతో ఆ పరీక్షను ఒకటో తేదీకి మార్చినట్లు డీఈవో రమేష్ తెలిపారు. ఈ సమాచారాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేసి, వారు ఏప్రిల్ 1న పరీక్షకు హాజరయ్యేలా చూడాలని కోరారు.
Similar News
News April 2, 2025
ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.
News April 2, 2025
వనపర్తి: ఇది పెద్దగూడెం రామాలయం చరిత్ర…!

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయాన్ని 1791లో నాటి వనపర్తి సంస్థానాధీశులు రాణి శంకరమ్మ తన భర్త రామేశ్వరరావు జ్ఞాపకార్థంగా నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. మూల విరాట్ విగ్రహాలను తమిళనాడు మఠాధిపతులు ప్రతిష్ఠించారని పెద్దగూడెం కోదండ రామాలయం ప్రధాన అర్చకులు రమణయ్య తెలిపారు.
News April 2, 2025
పంజాబ్ కింగ్స్: దేశీయ ఆటగాళ్లే బలం

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఈ జట్టులో ఎక్కువ మంది స్వదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. ఇందులో శ్రేయస్ ఒక్కడే జాతీయ జట్టు తరఫున ఆడారు. మిగతా అందరూ అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. ఇక బ్యాటర్లలో స్టొయినిస్, మ్యాక్సీ మాత్రమే ఫారిన్ ప్లేయర్లు.