News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై ఆఘాయిత్యం

అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27 సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాలుడికి మాయమాటలు చెప్పాడు. బలవంతంగా తన ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News July 5, 2025
ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే..

చాలామంది ఉదయాన్నే మోషన్ అవ్వక అవస్థలు పడతారు. బలవంతంగా వెళ్లేందుకు కష్టపడుతుంటారు. అయితే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాలు వ్యాకోచించి ఫ్రీగా మోషన్ అవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక నిత్యం జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, క్యారెట్, దుంపలు, బఠానీ, బీన్స్, ఓట్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
9న క్యాబినెట్ సమావేశం

AP క్యాబినెట్ సమావేశం ఈ నెల 9న జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జులై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
News July 5, 2025
ఏలూరు ఈనెల 14న మెగా జాబ్ మేళా

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు ఎంపీ మహేశ్ కుమార్ తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఏలూరు CR రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో బీటెక్, డిగ్రీ చేసిన వారు అర్హులన్నారు. రిజిస్టేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://naipunyam.ap.gov.in/user-registration