News March 29, 2025
నేడు బ్యాంకుల్లో పింఛన్ డబ్బులు జమ

AP: బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ల డబ్బులను ప్రభుత్వం ఇవాళే బ్యాంకుల్లో జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా నేడే బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తారు. కాగా ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.
Similar News
News April 2, 2025
గాంధీ ముని మనవరాలు కన్నుమూత

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.
News April 2, 2025
దేశానికి ఇవాళ బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల

AP: మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని YS షర్మిల ఆరోపించారు. పార్లమెంట్ ముందుకు ఆ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ బ్లాక్ డే అని తెలిపారు. వక్ఫ్ బిల్లును దేశంలోని 20కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని అన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు TDP, జనసేన మద్దతు పలకడం దారుణమని మండిపడ్డారు.
News April 2, 2025
నువ్వు దేవుడు సామీ.. వంటమనిషికి రూ.కోటి!

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ.కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజ్‌కు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఉన్న రూ.కోటి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు.