News March 29, 2025
పరీక్షలు రాయాలంటే 75% హాజరు తప్పనిసరి!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి CBSE 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు తప్పనిసరి చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్యవిద్య కోసమే 12వ తరగతి ఎగ్జామ్స్ రాసేందుకు డబ్బులు చెల్లించి నకిలీ పాఠశాలల్లో చేరుతున్నట్లు గుర్తించింది. తనిఖీల సమయంలో స్కూళ్లలో విద్యార్థులు లేకున్నా వారిని పరీక్షకు అనుమతించరు. అలాంటివారు ఓపెన్ స్కూల్‌లో ఎగ్జామ్స్ రాసుకోవాలని CBSE సూచించింది.
Similar News
News November 13, 2025
‘ఓం’ అని పలికితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఓంకార నాదంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ పవిత్ర శబ్దం, విశ్వ నాదం(432 Hz)తో ఏకమై కొత్త శక్తిని సృష్టిస్తుంది. దీనివల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై, అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే నిత్యం ఓంకార పఠనం చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.
☛ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 13, 2025
124 పోస్టులకు SAIL నోటిఫికేషన్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News November 13, 2025
డెయిరీ ఫామ్ నిర్వహణకు పాడి పశువులను ఎప్పుడు కొనాలి?

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న లాంటి పశుగ్రాసాలను.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ లాంటి చిక్కుడు జాతి పశుగ్రాసాలను సాగుచేయాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలని సలహా ఇస్తున్నారు.


