News March 29, 2025

కలిసిమెలిసి పండుగలు జరుపుకుందాం: మహబూబ్‌నగర్ MLA

image

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర అన్ని మతాల వారు కలిసిమెలిసి పండుగలు జరుపుకుందామని, కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహిద్దామని కాంగ్రెస్ నేత, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకుని మహబూబ్‌నగర్ పట్టణంలోని షాషబ్‌గుట్ట, సద్దలగుండు మసీదుల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మతసామరస్యం చాటుదామన్నారు.   

Similar News

News July 7, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల, సుంకేశుల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 59వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 880.40 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 190.33 TMCలుగా ఉంది. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

News July 7, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 7, 2025

చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

image

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.