News March 29, 2025
అమలాపురం: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు రంజాన్ సెలవు కావడంతో పరీక్షను ఒకటో తేదీకి మార్చినట్లు డీఈవో సలీం భాష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేసి, వారు ఏప్రిల్ 1న పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
Similar News
News April 2, 2025
భీమవరంలో వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

భీమవరం పట్టణంలోని ఈ నెల 28న అమ్మిరాజు తోటలో దొంగతనం కేసులో పట్టణానికి చెందిన నిందితుడు విట్టర్ పాల్‌ను సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. డీఎస్పీ జై సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు మంగతాయారు ఇంటికి వెళ్లి దగ్గర బంధువునని చెప్పి 3 గంటల పాటు విట్టర్ కబుర్లు చెప్పాడు. ఆమె భర్త బయటకు వెళ్ళగానే వృద్ధురాలిపై బ్లేడుతో దాడి చేసి బంగారాన్ని దొంగిలించాడు.
News April 2, 2025
97 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

ఫిబ్రవరిలో నిబంధనలు ఉల్లంఘించిన 97 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వీటిలో 14 లక్షల ఖాతాలపై ఫిర్యాదు రాకముందే చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే అకౌంట్లను ఏఐ సాంకేతికత ద్వారా గుర్తించింది. యూజర్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని వాట్సాప్ పేర్కొంది. స్పామ్ మెసేజ్‌లు పంపడం, నకిలీ అకౌంట్లు, థర్డ్ పార్టీ యాప్స్ వాడటం, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి కారణాలతో అకౌంట్లను బ్యాన్ చేస్తోంది.
News April 2, 2025
HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్‌పురా, చార్మినార్‌లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్‌ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.