News March 29, 2025

సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశం: BHPL ఎస్పీ

image

సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ మాస ముఖ్య ఉద్దేశమని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పట్టణ ముస్లీం పెద్దలు, పోలీసు ముస్లిం ఉద్యోగులకు ఎస్పీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం కలయికే రంజాన్ మాసం అని అన్నారు. రంజాన్ మాసం అందరిలో సోదర భావం పెంపొందిస్తుందని, ఈ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎస్పీ ఆకాంక్షించారు.

Similar News

News April 2, 2025

జిన్నారం: వాహనం తనిఖీ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు

image

జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగలక్ష్మి తన సిబ్బందితో నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న నాగలక్ష్మిని మద్యం మత్తులో కారు ఢీకొని వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించడంతో కారును కొద్దిపాటి దూరంలో వదిలి పారిపోయారు. స్వల్ప గాయాలతో ఎస్ఐ నాగలక్ష్మి బయటపడ్డారు.

News April 2, 2025

గాంధీ ముని మనవరాలు కన్నుమూత

image

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.

News April 2, 2025

NLG: ట్యాంకర్లతో పంట రక్షణ

image

జిల్లాలో వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.1000 వరకు తీసుకుంటున్నారని తెలిపారు.

error: Content is protected !!