News March 29, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శనివారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ్ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.
Similar News
News April 2, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో అధికారుల ఎలర్ట్

నరసరావుపేటలో పచ్చి చికెన్‌ను తిని బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడి బాలిక మృతి చెందడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలిక ఇంటితో పాటు సమీప ప్రాంతాలలో నివసించే వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో తొలి బర్డ్ ఫ్లూ మృతి కేసు కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చికెన్ షాపుల్లో సైతం పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 2, 2025
జిన్నారం: వాహనం తనిఖీ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు

జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగలక్ష్మి తన సిబ్బందితో నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న నాగలక్ష్మిని మద్యం మత్తులో కారు ఢీకొని వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించడంతో కారును కొద్దిపాటి దూరంలో వదిలి పారిపోయారు. స్వల్ప గాయాలతో ఎస్ఐ నాగలక్ష్మి బయటపడ్డారు.