News March 29, 2025
ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

AP: పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది.
Similar News
News April 2, 2025
నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం ‘కైలాస’ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించింది. నిత్యానంద జీవ సమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ నిన్న వెల్లడించారు. దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా.. తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. కాగా, నిత్యానంద ‘కైలాస’ సౌత్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఉంది.
News April 2, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న వైసీపీ

వక్ఫ్ సవరణ బిల్లుకు YSRCP వ్యతిరేకంగా ఓటు వేయనుంది. లోక్ సభ, రాజ్యసభ రెండింట్లోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు. అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు.
News April 2, 2025
నేను ఎవరితోనూ డేట్ చేయలేదు: హీరోయిన్

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ దివ్య భారతి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తాను ఏ నటుడితో గానీ పెళ్లైన వ్యక్తులతో గానీ డేట్ చేయలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో తన గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దివ్య భారతి, జీవీ కలిసి బ్యాచిలర్, కింగ్‌స్టన్ మూవీలో నటించారు. ఈ క్రమంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.