News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News November 8, 2025
బోయినపల్లి: డ్యామ్‌పై పిచ్చి మొక్కల బెడద

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మన్వాడ వద్ద గల మిడ్ మానేరు డ్యామ్ రోడ్డుపై పిచ్చి మొక్కల బెడద ఎక్కువైంది. కొదురుపాక నుంచి డ్యామ్ మీదుగా వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు అడ్డంగా పెరగడంతో పర్యాటకులకు, స్థానికులకు ఇబ్బందిగా మారింది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
News November 8, 2025
KGHలో పవర్ కట్.. ప్రభుత్వం సీరియస్

KGHలో గురువారం 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఛైర్మన్‌గా ఉన్న ఈ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అంతరాయం జరగడంపై ఆరోగ్యశాఖ సీరియస్ అయింది. కాగా.. కనీసం జనరేటర్లు కూడా సమకూర్చలేరా అంటూ YCP ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపింది. ‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది’అంటూ YCP నేతలు విమర్శలు గుప్పించారు.
News November 8, 2025
మెదక్ జిల్లాలో 14,15 తేదీల్లో కవిత పర్యటన

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత ఈనెల 14, 15 తేదీల్లో మెదక్ జిల్లాలో పర్యటించానున్నారు. 14న మెదక్ జిల్లా శివంపేట నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నర్సాపూర్, కౌడిపల్లి, కుల్చారం మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. 15న మెదక్ పట్టణం నుంచి ఏడుపాయల సందర్శిస్తారు. పలు సందర్శన అనంతరం మెదక్‌లో మేధావుల సమావేశంలో పాల్గొంటారు. కేవల్ కిషన్ సమాధి సందర్శించనున్నారు.


