News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News February 28, 2026
మార్చిలోనే టెన్త్ పాఠాలు

AP: ప్రభుత్వ పాఠశాలల్లోనూ 9th క్లాస్ విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు బోధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వారికి మార్చి 12లోపే SA-2 పరీక్షలను పూర్తి చేయనుంది. APR 23 వరకు పదో తరగతికి సంబంధించి ప్రతి సబ్జెక్టులో 4 చాప్టర్లను టీచర్లు బోధిస్తారు. GOVT స్కూళ్లలో బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దీనివల్ల వచ్చే విద్యాసంవత్సరంలో సిలబస్ త్వరగా పూర్తయి ప్రిపరేషన్‌కు అధిక సమయం ఉంటుంది.
News February 28, 2026
ఆసిఫాబాద్: నీరుగారుతున్న హరిత లక్ష్యం

ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో గత ఏడాది 40.53 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించినా నిర్వహణ లోపంతో మొక్కలు పశువుల పాలవుతున్నాయి. సామాజిక తనిఖీల్లో ఈ అంశంపై చర్చ జరిగినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
News February 28, 2026
VZM: యాక్సిడెంట్.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి గోపాలరావు కొంత కాలంగా విశాఖలో నివాసం ఉంటున్నారు. BHV సమీపంలో గోపాలరావు ప్రయాణిస్తున్న స్కూటీని GVMC లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


