News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News April 2, 2025
GNT: ఉద్యోగాల జాబితా విడుదల

గుంటూరు DMHO కార్యాలయం పరిధిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు DMHO విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. DEO, LGS, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్టును guntur.ap.gov.in లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ROR ప్రకారం లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.
News April 2, 2025
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్స్

నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.
News April 2, 2025
GNT: రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

గుంటూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ముగియటంతో పట్టణంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 3 ప్రారంభించి 9వ తేదీలోగా మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. జిల్లా 1.80 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. మూల్యాంకనం కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్స్ వంటి వివిధ రకాల విధుల కోసం 643మంది ఉపాధ్యాయులను నియమించినట్లు DEO రేణుక తెలిపారు.