News March 29, 2025
Xను విక్రయించిన ఎలాన్ మస్క్

తన సోషల్ మీడియా సంస్థ X(ట్విటర్)ను తన AI కంపెనీ xAIకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం xAI $45B చెల్లించనుంది. $12B అప్పు పోగా X విలువ $33Bగా ఉండనుంది. xAI వాల్యూ $80B అని మస్క్ పేర్కొన్నారు. ఇక నుంచి ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, కలిసి పని చేస్తాయని తెలిపారు. ఈ కంబైన్డ్ కంపెనీ యూజర్లకు జ్ఞానంతో పాటు ఉపయోగకరమైన అనుభవాలను ఇస్తుందని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
BREAKING: పాకిస్థాన్ స్కోర్ ఎంతంటే?

ASIA CUP-2025: టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. 20 ఓవర్లలో ఆ జట్టు 127/9 పరుగులు చేసింది. భారత పేసర్లు, స్పిన్నర్ల ధాటికి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కుల్దీప్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2, హార్దిక్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. చివర్లో షాహీన్ అఫ్రిది 4 సిక్సర్లు బాదారు. మరి భారత్ ఎన్ని ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తుందో కామెంట్ చేయండి.
News September 14, 2025
పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు: అధికారులు

AP: <<17705296>>తురకపాలెం<<>>లో నీటిలో పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. తాగు నీటిలో యురేనియం లీటరుకు 30 మైక్రో గ్రాములు(0.03 mg/l)గా ఉంటుందని, తురకపాలెంలో యురేనియం ఆనవాళ్లు 0.001 mg/l కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు రోజులుగా కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు.
News September 14, 2025
OG: డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘OGని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు’ అని పేర్కొంటూ పవన్ ఫొటోలను షేర్ చేసింది. అంతకుముందు డైరెక్టర్ సుజిత్, తమన్‌తో పవన్ ఉన్న ఫొటోను పంచుకుంది. ‘మిలియన్ డాలర్ పిక్చర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. OG లోగోతో ఉన్న డ్రెస్‌ను పవన్ ధరించడం గమనార్హం. ఈ మూవీ SEP 25న రిలీజ్ కానుంది.