News March 29, 2025
మంచిర్యాల: అర్ధరాత్రి దొంగల బీభత్సం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే దుండగులు బంగారం, వెండీ వస్తువులతో ఉడాయించారు. స్థానికుల వివరాలు.. BRS నాయకుడి ఇంటితో పాటు మరొకరి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి తలుపులు తెరిచి 30తు. బంగారు వస్తువులు, కిలోన్నర వెండి ఎత్తుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News November 9, 2025
ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌లకు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
News November 9, 2025
చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.
News November 9, 2025
రూ.318 కోట్లతో ఫుడ్ పార్కులు.. 11న సీఎం శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు నవంబర్ 11న వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమలలో రూ.208 కోట్లతో గోద్రెజ్ ఆగ్రోవెట్, నూజివీడులో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,866 మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.


