News March 29, 2025
VJA: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో కృష్ణా జిల్లా అవినిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలాది లభ్యమయ్యాయి. మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News September 15, 2025
SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.
News September 15, 2025
పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.
News September 15, 2025
MHBD: తప్పని గోస.. రైతు వేదిక వద్దకే సద్ది బువ్వ!

మహబూబాబాద్ రైతన్నలకు యూరియా కష్టాలు తప్పట్లేదు. మబ్బులోనే PACS సెంటర్లు, రైతు వేదికలకు చేరుకుంటున్నప్పటికీ టోకెన్లు, యూరియా బస్తాలు దొరక్క అరిగోస పడుతున్నారు. మరిపెడ మండలం తానంచర్లలోని రైతు వేదికలో యూరియా టోకెన్లు ఇస్తారనే సమాచారం అందుకున్న రైతులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి ఉంటుందని ముందే గ్రహించిన రైతున్న సద్ది పెట్టుకొని వచ్చి అక్కడే భోజనం చేశాడు.