News March 29, 2025
ముగిసిన శిథిలాల తొలగింపు

భద్రాచలంలోని ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు శుక్రవారం ముగిసింది. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు, ఉపేందర్ మృతదేహలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 42గంటల పాటు సహాయక బృందాలు, అధికారులు శిధిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇంటి యజమాని శ్రీపతి దంపతులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.
Similar News
News September 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News September 17, 2025
తుని: 108 వాహనంలో మహిళ ప్రసవం

తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన మల్లి ఆశకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పాయకరావుపేట 108 సిబ్బంది ఆమెను తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కవ కావడంతో మెడికల్ టెక్నీషియన్ శ్రీనివాస్ చికిత్స అందించి అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
News September 17, 2025
ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.