News March 29, 2025

ఫిలిప్పీన్స్‌కు యాదాద్రి భువనగిరి బియ్యం

image

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఫిలిప్పీన్‌కి బియ్యం ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా జిల్లాలోని నాలుగు మిల్లుల నుంచి 1,570 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేయాల్సి ఉంది. తొలి విడతలో 570 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని APలోని కాకినాడ పోర్టుకు లారీల ద్వారా చేరవేశారు. అక్కడి నుంచి నౌకలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయనున్నారు.

Similar News

News January 10, 2026

ములుగు: మంత్రి నిర్ణయమే ఫైనల్..!

image

కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా పూర్తి స్థాయి కార్యవర్గం లిస్ట్ రెడీ అయ్యింది. ఇప్పటికే అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ ఎన్నికయ్యారు. 36 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేయగా ఉపాధ్యక్షులుగా ముగ్గురు, ప్రధాన కార్యదర్శులుగా ఆరుగురు, కార్యదర్శులుగా ఐదుగురు, కోశాధికారిగా ఒక్కరు, అధికార ప్రతినిధిగా ఒక్కరు, కార్యవర్గ సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు. మంత్రి సీతక్క ఓకే చెప్పిన వెంటనే ప్రకటించనున్నారు.

News January 10, 2026

OFFICIAL: రాజాసాబ్‌కు ఫస్ట్ డే రూ.112 కోట్లు

image

ప్రభాస్-మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ తొలిరోజు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా ఈ మూవీ ఫస్ట్‌డే వరల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ కేటగిరీలో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ అంటూ ట్వీట్ చేసింది.

News January 10, 2026

దక్షిణమూర్తి పూజ

image

వ్యాపారంలో ఆటంకాలు, ఉద్యోగంలో ఒత్తిడి, పిల్లల చదువు, కెరీర్ విషయంలో గందరగోళానికి గురవుతున్నారా? అయితే దక్షిణమూర్తి స్వామిని పూజించడం వల్ల మేధస్సు పెరిగి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. చదువు, కెరీర్, వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్ర సమయంలో స్వామి కృప కోసం మీ పేరు, గోత్రంతో పూజలో పాల్గొని విజయాలను పొందడానికి వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.