News March 29, 2025
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 15మంది మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో 15మంది మావోయిస్టులను అంతం చేసినట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి. అక్కడి గోగుండా కొండమీది ఉపంపల్లిలో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఈరోజు ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు జవాన్‌లకు గాయాలైనట్లు సమాచారం.
Similar News
News September 14, 2025
Gen-Z పాపులేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువంటే?

Gen-Z యువత(1997-2012 మధ్య పుట్టినవారు) తలచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయనడానికి నేపాల్ ఆందోళనలే నిదర్శనం. మన దేశంలో Gen-Z పాపులేషన్ 27.1% ఉందని ‘India in Pixels’ రిపోర్ట్ తెలిపింది. అత్యధికంగా బిహార్‌లో 32.5%, ఆ తర్వాత J&Kలో 30.8%, ఝార్ఖండ్ 30.7%, UP 30%, రాజస్థాన్ 29.2%, నార్త్‌ఈస్ట్‌లో 29.2% యువత ఉన్నారంది. ఇక TGలో 24.8%, కర్ణాటక 24.1%, AP 23.5%, TN 22%, కేరళలో 21.8% Gen-Zలు ఉన్నట్లు పేర్కొంది.
News September 14, 2025
రోజా.. నువ్వు జబర్దస్త్ చేయలేదా?: దుర్గేశ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్‌లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్‌కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.
News September 14, 2025
టాస్ గెలిచిన భారత్

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్