News March 29, 2025
వికారాబాద్: జిల్లాలో 92% ఇంటి పన్ను వసూలు

వికారాబాద్ జిల్లాలో 92 శాతం ఇంటి పన్నులు వసూలయ్యాయి. నేటి వరకు కోట్ పల్లి, వికారాబాద్, బంట్వారం మండలాలలో 100% వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 20 మండలాల్లో కేవలం మూడు మండలాల్లోనే 100% వసూలు కాగా మిగతా 17 మండలాల్లో 85 నుంచి 90 శాతం పైగా వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటి పన్ను వసూలుకు మార్చి 31తో గడువు ముగియనుంది.
Similar News
News November 7, 2025
సబ్బవరం: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News November 7, 2025
నేడు సామూహిక ‘వందేమాతరం’ గీతాలాపన

వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు సామూహిక గీతాలాపన చేయాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ సముదాయంలో ఉదయం 10 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన జరుగుతుందని ఆయన ప్రకటించారు.
News November 7, 2025
ORRకు NTR జిల్లాలో భూసేకరణ పూర్తి.. ఆ మండలాల మీదుగానే.!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి NTR జిల్లాలో భూసేకరణ పూర్తి చేశారు. మైలవరం, G.కొండూరు, వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో 18 గ్రామాల మీదుగా సుమారు 51 K.M పరిధిలో ORR నిర్మాణం కానుంది. జిల్లాలో 3,300 ఎకరాల భూమిని సేకరించి వాటి వివరాలు NH అధికారులకు అధికారులు పంపారు. త్వరలో సేకరించనున్న భూముల వివరాలు, కంపెన్సేషన్ తెలుపుతూ గెజిట్ విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.


