News March 29, 2025

విశాఖలో ప్రేమ పేరుతో మోసం

image

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News November 14, 2025

Jubilee hills bypoll: రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు!

image

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగనుంది. అయితే, రౌండ్ల వారీగా రిజల్ట్ అప్‌డేట్స్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ECI చర్యలు తీసుకుంది. స్టేడియంలో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని అధికారులు చెప్పారు. Way2Newsలోనూ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాల వివరాలు చూసుకోవచ్చు.
SHARE IT

News November 14, 2025

గుడ్లూరు: హైవేపై విషాదం.. దంపతులు మృతి

image

గుడ్లూరు (M)మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో NTR(D) జి కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.

News November 14, 2025

దుల్కర్ ‘కాంత’ మూవీ పబ్లిక్ టాక్

image

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీబోర్సే జంటగా నటించిన ‘కాంత’ మూవీ ప్రీమియర్లు నిన్న పడ్డాయి. సినిమా థ్రిల్‌కు గురి చేస్తుందని మూవీ చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దుల్కర్, భాగ్యశ్రీ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.