News March 25, 2024

శ్రీకాకుళం: పాము కాటుతో మహిళ మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన చింతాడ చెల్లమ్మ (46) పాము కాటుతో సోమవారం మృతి చెందింది. ఇటీవల పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

Similar News

News March 22, 2026

శ్రీకాకుళం జిల్లాలోని బీసీ హాస్టల్స్ అప్‌డేట్

image

శ్రీకాకుళం జిల్లాలో 81 బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలుండగా 56 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాల్లో సుమారు 6,800 మంది విద్యార్థులున్నారు. ఈ గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లు, పవర్‌ కట్ సమయంలో ఇబ్బంది లేకుండా ఇన్వర్టర్లు, పక్కా మెనూ, కొత్త నిర్మాణాలు నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోట్లల్లో నిధులను వెచ్చించనుంది. విద్యార్థులకు ప్రత్యేక వసతుల కల్పనపై దృష్టి పెట్టినట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి అనురాధ చెప్పారు.

News March 22, 2026

అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2026

శ్రీకాకుళం: కమర్షియల్ గ్యాస్ కొరత… మూతపడుతున్న హోటల్స్

image

శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస, పలాస కాశిబుగ్గ, ఇచ్చాపురం వంటి పట్టణాలు, నరసన్నపేట, పొందూరు వంటి ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత సమస్యగా మారింది. దీంతో హోటల్లో మూతపడుతున్నాయి. జిల్లాలో 400 వరకు హోటల్స్ ఉన్నాయి. హోటళ్ల సంక్షోభం అల్పాహారం, భోజనం కోసం ఆధారపడే వారితోపాటు, హోటల్లో పనిచేస్తున్న వారిపై సైతం ప్రభావం చూపుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.