News March 29, 2025
ధోనీకి చెప్పే ధైర్యం కోచ్‌లకు లేదు: మనోజ్

CSK జట్టును గెలిపించేందుకు ధోనీని ముందే బ్యాటింగ్‌కు వెళ్లమని చెప్పే ధైర్యం కోచింగ్ సిబ్బందికి లేదని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శించారు. 9వ స్థానంలో ధోనీ రావడం ఏంటని ప్రశ్నించారు. ‘ధోనీ 16 బంతుల్లో 30 రన్స్ చేసి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నారు. ఇలాంటి బ్యాటర్ ముందే బ్యాటింగ్‌కు రావాల్సింది. ఈ విషయాన్ని కోచ్‌లు కూడా చెప్పలేరు. ఎందుకంటే ధోనీ ఒకసారి నిర్ణయించుకుంటే అంతే’ అని తెలిపారు.
Similar News
News April 2, 2025
లక్నో పిచ్ పంజాబ్ క్యూరేటర్ తయారు చేసినట్లుంది: జహీర్‌ఖాన్

IPL: నిన్న పంజాబ్ చేతిలో ఘోర ఓటమి అనంతరం LSG మెంటార్ జహీర్‌ఖాన్ లక్నో పిచ్ క్యూరేటర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అతడికి హోం గేమ్ అన్న ఆలోచన కూడా లేదన్నారు. లక్నో పిచ్‌ను పంజాబ్ క్యూరేటర్ సిద్ధం చేసినట్లు అనిపిస్తోందన్నారు. ఇకపై తమకు అనుకూలంగా పిచ్ ఉండేలా జాగ్రత్త పడతామన్నారు. కాగా హోం పిచ్‌లపై ఇప్పటికే చెన్నై, కోల్‌కతా జట్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
News April 2, 2025
HCU భూములపై NGTలో ఫిర్యాదు

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
News April 2, 2025
‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.