News March 29, 2025
గద్వాల జిల్లా ప్రజలారా జర జాగ్రత్త…!

జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. శుక్రవారం గరిష్ఠంగా ధరూర్‌లో 40.8, భీమవరం, తోతినోనిదొడ్డిలో 40.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 25, 2025
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు: డీకే అరుణ

గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డికే అరుణ అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
News December 25, 2025
ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.
News December 25, 2025
శివుడిగా పూజలందుకున్న తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారు ఒకప్పుడు శివుడిగా పూజలందుకున్నారని చాలామందికి తెలిసుండదు. మూలవిరాట్టుకు ఉన్న జటలు, నాగభూషణాలు చూసి భక్తులు ఆయనను ఈశ్వరుడిగా భావించేవారు. రామానుజాచార్యులు నిర్వహించిన పరీక్షలో శ్రీవారు శంఖుచక్రాలు ధరించి అది వైష్ణవ రూపమని నిరూపించారు. తిరుమల ఆలయానికి రుద్రుడు క్షేత్రపాలుడిగా ఉండటం హరిహర అద్వైతానికి, శైవ వైష్ణవ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


