News March 29, 2025
తిరువూరు: అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన కొలికపూడి వ్యవహారం

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం TDP అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఆ పార్టీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం ప్రకటించారు. నేటి ఉదయం11 గంటలకు ఆయన విధించిన డెడ్‌లైన్ పూర్తికానుంది. దీంతో ఆయన ఏం చేస్తారనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా మరోవైపు కొలికపూడి తీరుపై అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మీరేమనుకుంటున్నారో COMMENT చేయండి.
Similar News
News October 23, 2025
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం

వనపర్తి జిల్లాలో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా అత్యధికంగా విల్లియంకొండలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏదుల 7.5 మి.మీ, ఆత్మకూర్ 7.3 మి.మీ, రేమెద్దుల 5.5 మి.మీ, జానంపేట 4.5 మి.మీ, వీపనగండ్ల 2.5 మి.మీ, వనపర్తి, వెలుగొండ, కేతపల్లి 1.8 మి.మీ, పెబ్బేరు 1.0 మి.మీ, రేవల్లి 0.8 మి.మీ, రేవల్లి 0.5 మి.మీ, మిగతా 8 కేంద్రాలలో 0.0 మి.మీ వర్షపాతం నమోదయింది.
News October 23, 2025
కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
News October 23, 2025
ఇంజనీర్ టూ రౌడీ షీటర్..

ఇంజనీరింగ్ చదువుకున్న చింటూ మరైన్ ఇంజనీరింగ్‌గా పనిచేశారు. అనంతరం మేనమామ కటారి మోహన్‌కు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారు. చిత్తూరును అప్పట్లో శాసిస్తున్న సీకే బాబుకు దీటుగా చింటూ అంచెలంచెలుగా ఎదిగారు. 2007 డిసెంబర్ 31న సీకే బాబుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్, అనంతరం గన్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రస్తుత కేసులో అనేక షరత్తులతో బెయిల్‌పై ఉన్నారు.


