News March 29, 2025

రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPనే: లోకేశ్

image

AP: రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPకే సాధ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘NTR అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం. 43 ఏళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారు. మన పార్టీకి గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. TDP జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు’ అని పార్టీ ఆవిర్భావ సభలో తెలిపారు.

Similar News

News September 14, 2025

కొడుకును చంపి నదిలో పడేశాడు!

image

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News September 14, 2025

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.

News September 14, 2025

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో జాబ్‌లు

image

<>ఇస్రో <<>>అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 13 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీ‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. వెబ్‌సైట్: https://careers.sac.gov.in/