News March 29, 2025
వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.
Similar News
News March 3, 2026
చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న పవన్‌కు సీఎం స్వాగతం పలికారు. ఆపై ఇరువురూ సమావేశమయ్యారు. టీటీడీ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది. అలాగే తన శాఖలకు సంబంధించిన అంశాలపైనా పవన్ చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు సమాచారం.
News March 3, 2026
ఖమ్మం: ఆ తండాలో 3 రోజులు హోలీ సంబరాలు

కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 3 రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ప్రారంభం కానుంది. కుల పెద్దలు డప్పు కొట్టి హోలీని ప్రారంభిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ఉట్టి పడే విధంగా హోలీ వేడుకలు ఉంటాయి.
News March 3, 2026
మైలవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మైలవరానికి చెందిన అబ్దుల్ మానేన్ (29) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కారులో చెన్నై వెళుతుండగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు(M) తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నెల్లూరు వైపు వెళ్తున్న కర్రల లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు చేతుకొచ్చిన కొడుకు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు.


