News March 29, 2025
వనపర్తి: రేషన్‌కార్డు దారులకు శుభవార్త

ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 17, 2026
ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడిదుడుకులు చూశాం: కొప్పుల

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ధర్మపురిలో మాట్లాడుతూ.. అధికార పార్టీకి ధన బలం, అధికార బలం ఉంటే.. BRSకు ప్రజాబలం ఉందన్నారు. పార్టీ మారినవారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక ఉద్యమ పార్టీగా ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూశామని వ్యాఖ్యానించారు. KCR హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.
News January 17, 2026
హైదరాబాద్: మ్యూజిక్ లవర్స్‌కు కిరాక్ న్యూస్!

‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ నగరానికి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్రభారతిలో ఈ స్వర విందు జరగనుంది. హిందుస్థానీ గాత్ర దిగ్గజం పండిట్ జయతీర్థ మేవుండి, కర్ణాటక వేణుగాన విద్వాంసుడు శశాంక్ సుబ్రమణ్యం పోటీపడి వినిపించే ‘జుగల్బందీ’ హైలైట్ కానుంది. తబలాపై వి.నరహరి, మృదంగంపై సతీశ్ పత్రి లయ విన్యాసాలు చేయనున్నారు. బుక్‌మైషోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.


