News March 25, 2024
శ్రీకాకుళం: అక్కడ ఒకరోజు తర్వాత హోలీ

పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Similar News
News October 25, 2025
గార: నాగుల చవితి జరుపుకోని గ్రామం ఇది!

దీపావళి అమావాస్య తర్వాత వచ్చే నాగుల చవితిని ప్రతి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం కొనసాగుతోంది. అయితే జిల్లాలోని గార మండలం బూరవెల్లిలో నాగులచవితిని మాత్రం ఇవాళ జరుపుకోరు. ఏటా కార్తీక శుద్ధ షష్టి తిథి నాడే ఇక్కడ చవితిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని గ్రామానికి చెందిన వేద పండితులు ఆరవెల్లి సీతారామాచార్యులు తెలిపారు. ఇందుకు నిర్ధిష్ట కారణం ఏదీ లేదని.. షష్టి నాడు జరుపుకుంటామన్నారు.
News October 25, 2025
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పిక్నిక్ ప్రదేశాలు ఇవే..

శ్రీకాకుళం జిల్లాలో కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్‌లు జరుపుకోనున్నారు. మన జిల్లాలో వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బౌద్ధ శిల్పాలు, బారువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాలు పిక్నిక్ జరుపుకొనే ప్రాంతాలుగా ప్రసిద్ధి పొందినవి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News October 25, 2025
SKLM: ‘ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సూచనలు ఇవ్వాలి’

ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను DRO ఎం. వెంకటేశ్వరరావు కోరారు. కలెక్టరేట్‌లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదు, తొలగింపుల పై సమాచారం అందించాలన్నారు. రాజకీయ పార్టీల సూచనలు, సలహాలు ఎంతో దోహదం చేస్తాయన్నాయని తెలియజేశారు. ఫారం-6, 7, 8ల సమాచారం ఇవ్వాలని కోరారు.


