News March 29, 2025

రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్‌లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

లక్నో పిచ్ పంజాబ్ క్యూరేటర్ తయారు చేసినట్లుంది: జహీర్‌ఖాన్

image

IPL: నిన్న పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమి అనంతరం LSG మెంటార్ జహీర్‌ఖాన్ లక్నో పిచ్ క్యూరేటర్‌‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అతడికి హోం గేమ్ అన్న ఆలోచన కూడా లేదన్నారు. లక్నో పిచ్‌ను పంజాబ్ క్యూరేటర్ సిద్ధం చేసినట్లు అనిపిస్తోందన్నారు. ఇకపై తమకు అనుకూలంగా పిచ్ ఉండేలా జాగ్రత్త పడతామన్నారు. కాగా హోం పిచ్‌లపై ఇప్పటికే చెన్నై, కోల్‌కతా జట్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News April 2, 2025

HCU భూములపై NGTలో ఫిర్యాదు

image

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

News April 2, 2025

‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.

error: Content is protected !!