News March 29, 2025
సిరిసిల్ల : పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

సిరిసిల్ల పట్టణం గీతానగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.
Similar News
News November 8, 2025
VJA: ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదించిన ప్రజాప్రతినిధులు

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్‌కు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ RRR, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఆది నుంచి అంతం వరకు వారు ఇళయరాజా స్వర రాగాలను ఆస్వాదించారు.
News November 8, 2025
యువతకు భద్రత కల్పించండి: SP

యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని SP ధీరజ్ కునుబిల్లి శనివారం జిల్లా పోలీసులను ఆదేశించారు. ‘శక్తి’ టీమ్ బృందాలు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల నివారణపై విద్యార్థులకు పోలీసులు వివరించారు. తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) షేర్ చేయడం వలన ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.
News November 8, 2025
బండి సంజయ్ హాట్ కామెంట్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.


