News March 29, 2025

యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా శంకర్‌ది భువనగిరి జిల్లా.

Similar News

News November 11, 2025

EXIT POLLS: బిహార్‌లో NDAకే పట్టం!

image

ఓట్ చోరీ సహ అనేక ప్రభుత్వ వ్యతిరేకాంశాలను ప్రచారం చేసినా బిహార్ ప్రజలు ఎన్నికల్లో అధికార NDA కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వేలో NDAకి 145-160 సీట్లు, MGBకి 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JVC-టైమ్స్ నౌ NDAకి 135-150, MGBకి 88-103 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిజ్-IANS NDAకి 147-167, MGBకి 70-90 సీట్లు దక్కుతాయని పేర్కొంది.

News November 11, 2025

సంగారెడ్డి: ‘సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలి’

image

సంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు చేసిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మంగళవారం ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ, టీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల మానయ్య, ప్రసాద్ మాట్లాడుతూ.. ఇతర మండలాలకు కేటాయించిన వారిని పని చేస్తున్న మండలంలోనే సర్దుబాటు చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు.

News November 11, 2025

‘AI విద్యాబోధన ద్వారా విద్యార్థుల్లో మార్పునకు కృషి చేయాలి’

image

విద్యావిధానంలో ఏఐ విద్యాబోధన ద్వారా విద్యార్థులలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏఐ బోధన, విద్యార్థుల హాజరు శాతం పెంపుదల, నాణ్యమైన విద్యాబోధన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు 100 శాతం హాజరయ్యేలా చూడాలన్నారు.