News March 29, 2025

కరీంనగర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి

image

కరీంనగర్ నగర పాలక పరిధిలోని రేకుర్తి సింహాద్రి కాలనీలో ప్రమాదవశాత్తు చెరువులో పడి శ్రీనిధి అనే బాలిక మృతి చెందింది. పెంపుడు కుక్కను బయటికి తీసుకువెళ్లగా.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2026

ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

News January 11, 2026

ములుగు జిల్లా రద్దు నిజమేనా..?

image

ఆరు ముక్కలుగా విభజించిన ఉమ్మడి వరంగల్ జిల్లాను మళ్లీ అతికించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రచారం జోరందుకోవడంతో వరంగల్, హనుమకొండలను విలీనం చేయడంతో పాటుగా, భూపాలపల్లి జిల్లాలో ములుగును విలీనం చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నో గొడవల నేపథ్యంలో ఏర్పాటైన ములుగు జిల్లాకు మంగళం పాడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

News January 11, 2026

డియర్ పేరెంట్స్.. పిల్లలు జాగ్రత్త

image

సంక్రాంతికి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసే ఉత్సాహంలో ఉంటారు. ఒకవైపు చైనా మాంజా ప్రమాదకారిగా మారితే.. మరోవైపు విద్యుత్ షాక్‌లు పేరెంట్స్‌ను కంగారు పెడుతున్నాయి. అన్నమయ్య జిల్లా గోరంచెరువు గ్రామంలో గాలిపటం ఎగరవేస్తూ విద్యుత్ తీగలు తగిలి ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. డాబాలు, అపార్ట్‌మెంట్లు కాకుండా ఓపెన్ ప్లేస్, గ్రౌండుకు తీసుకెళ్లి పతంగి ఎగరేయించండి. బాల్కనీల్లో గాలిపటాలు ఎగరేయడం ప్రమాదకరం. ShareIt.