News March 29, 2025

అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణ చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపారు.

Similar News

News December 28, 2025

2025: ‘అంచనాలు’ అందుకోలేకపోయారు?

image

ఈ ఏడాది పలువురు టాలీవుడ్ హీరోల సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. విడుదలకు ముందు బజ్ ఉన్నా రిలీజ్ తర్వాత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విష్ణు ‘కన్నప్ప’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రవితేజ ‘మాస్ జాతర’ లిస్టులో ఉన్నాయి. ఈ ఏడాది రిలీజైన వాటిలో మిమ్మల్ని నిరాశపర్చిన సినిమా ఏంటి?

News December 28, 2025

అంబేడ్కర్ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

image

అంబేడ్కర్ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జనవరి 2 వరకు పొడగించారు. డిగ్రీ (సీబీసీఎస్‌) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు 27న ముగియగా, జనవరి 2 వరకు పొడగించారు. అలాగే పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు 500 రూపాయల ఫైన్‌తో చెల్లింపు గడువు 27న ముగియగా, దాన్ని జనవరి 2 వరకు పొడగించారు.

News December 28, 2025

MBNR: SSC, INTER.. అప్లై చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరెందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. వచ్చేనెల 5లోగా.. ఫైన్‌తో 16లోగా అప్లై చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. www.telanganaopenschool.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు. SHARE IT