News March 25, 2024

అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్

image

ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పొలమూరి మోహన్ బాబు బీఎస్పీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తనకు బీఎస్పీ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News September 18, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.

News September 18, 2025

పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

image

యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.

News September 18, 2025

రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

image

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.