News March 29, 2025
జూలూరుపాడులో పర్యటించిన అ.కలెక్టర్ విద్యాలత

జూలూరుపాడు మండలంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాలత పర్యటించారు. పలు గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
ఓపెనర్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ.. వార్నర్ సరసన హెడ్

ENGతో తొలి టెస్టులో 69బంతుల్లోనే సెంచరీ చేసిన AUS ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా వచ్చి వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా వార్నర్ సరసన నిలిచారు. 2012లో INDపై వార్నర్ 69బాల్స్‌లోనే సెంచరీ కొట్టారు. ఇక ఛేజింగ్‌లో 4వ ఇన్నింగ్స్‌లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా, ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ శతకం బాదిన 8వ బ్యాటర్‌గా హెడ్ నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో మెక్‌కల్లమ్ ఉన్నారు. ఆయన AUSపై 54బంతుల్లోనే సెంచరీ కొట్టారు.
News November 22, 2025
SRCL: ‘ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి’

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరంటాల, గంభీరావుపేట, లింగన్నపేట, ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, పదిర, రాగట్లపల్లి, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, తిమ్మాపూర్, కిషన్ దాస్ పేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తనిఖీ చేశారు.
News November 22, 2025
పూలు, సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టి సారించాలి: ప్రేమ్ సింగ్

నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి, DPT డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ప్రేమ్ సింగ్ శనివారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్, డ్రిప్, పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం పథకాల అమలును ఆయన పరిశీలించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పూలు, సుగంధ ద్రవ్యాల సాగును పెంచాలని సూచించారు. రైతులకు డ్రిప్ పరికరాలను సకాలంలో అందించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.


