News March 29, 2025

యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్‌ది నల్గొండ జిల్లా.

Similar News

News November 14, 2025

సంగారెడ్డి: జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు

image

సంగారెడ్డి జిల్లా వైద్య అధికారిగా డాక్టర్ వసంత రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల నుంచి బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు.

News November 14, 2025

తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే?

image

జుట్టు నల్లగా ఉండటానికి కారణమయ్యే మెలనోసైట్లు తగ్గటానికి విటమిన్‌ డి లోపం, మానసిక ఒత్తిడి, సిగరెట్లు తాగటం, ఇతరులు కాల్చిన సిగరెట్ల పొగ పీల్చటం, వాయు కాలుష్యం, నిద్రలేమి, షిఫ్ట్‌ ఉద్యోగాలు వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మెలటోనిన్‌ బాగా తయారవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు తెల్లబడటాన్ని ఆపొచ్చు. మరీ అవసరమైతే వైద్యుల సూచనతో సప్లిమెంట్లు వాడొచ్చు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన.. BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.